ABOUT ME

Bukke Vinod Kumar Naik.

ఈ అంశాలపై నిస్సంకోచంగా మీ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చును. పీర్యాదులు, సలహాలు మరియు ఇతర అంశాలపై సంప్రదించగలరు. నా e-Mail Id : me@itsvinod.in సెల్: 9000067587

భూమికి మరింత దగ్గరగా చంద్రుడు ..!!


AA

చల్లగా హాయిగా కనిపించే చంద్రుడు.. ఉగ్రరూపం దాల్చనున్నాడా? 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూమికి దగ్గరగా రానున్నాడు చందమామ. దీంతో భూమిపై విపరీతాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా ప్రమాదం ? పండు వెన్నెల కురిపించే నిండు చంద్రుడు.. చల్లని వెన్నెలని అందించే చక్కనైన చందమామ... నిప్పులు కురిపించనున్నాడా ? మనసు దోచుకునే చంద్రుడే ముప్పు తెస్తాడా? భూమిపై విపరీతాలకు కారణమవుతాడా? ఇవన్నీ కేవలం అనుమానాలు మాత్రమే కాదు... నిఖార్సయిన నిజాలు.

శాస్త్రవేత్తల ఆందోళనలు....Spot ఈ నెల 19న చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దగ్గరగా రానున్నాడు. ఆ రోజున భూమికి, చంద్రుడికి మధ్య దూరం 2,21,556 మైళ్లకు తగ్గుతుంది. ఎప్పుడూ ఉండే దూరంతో పోలిస్తే ఇది 17 వేల కిలోమీటర్లు తక్కువ. ఇలా భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్‌మూన్ అని అంటాం. ఈసారి మరీ దగ్గరగా రానుండడంతో.. దీనికి ఎక్స్‌ట్రీమ్‌ సూపర్‌మూన్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. పేరు బాగానే ఉంది.


కానీ అది చేయబోయే పనే కొంపలు ముంచేలా ఉంది. చంద్రుడు, భూమికి ఇలా దగ్గరగా రావడం వల్ల అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. సునామీలు విరుచుకుపడతాయి. భూకంపాలు సంభవిస్తాయి. వైపరీత్యాలు వచ్చిపడతాయి ఇంతకుముందు కూడా ఇంతే. 1955, 1974, 1992, 2005 లో కూడా ఇదే పరిస్థితి. అప్పుడూ ఇలాంటి సమస్యలే వచ్చాయి. ఇండోనేషియాలో పెను భూకంపం... తర్వాత వచ్చిన సునామీ... ఇవన్నీ దీని ఫలితాలే.


మరిప్పుడు కూడా అలాగే జరగనుందా ? కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మరీ విపరీతాలు చోటు చేసుకోవని... అవన్నీ అనవసర భయాలని కొట్టిపారేస్తున్నారు. కాకపోతే... సముద్ర ఆటుపోట్లలో తేడా ఉండొచ్చని అంటున్నారు. అంతకుముందు చంద్రుడు ఎన్నోసార్లు భూమికి దగ్గరగా వచ్చినా ఒక్కసారే సునామీ వచ్చిందని చెబుతున్నారు.

0 స్పందనలు:

Post a Comment