న అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. మర్యాద, మంచి రాజకీయాలు, మంచి పాలన నినాదమే లోక్‌సత్తా ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశాన్ని శాసించేది యువత, మహిళ ఓటర్లేనని, మార్పు వారి నుంచే రావాలని అన్నారు.
వివేచనతో సంక్షోభాన్ని పరిష్కరించుకుందాం: కటారి
తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వివేచనతో పరిష్కరించుకుందామని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలవారూ సంతృప్తి చెందేలా ఒక సమగ్ర, సానుకూల పరిష్కారాన్ని తాము ప్రజలముందు ఉంచామని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం అసహజమైన రీతిలో రుద్దుతున్న ఈ సంక్షోభాన్ని భావోద్వేగాలకు అతీతంగా, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గణతంత్ర వ్యవస్థ నిజమైన లక్ష్యాలకనుగుణంగా దేశాన్ని నడిపించడానికి ప్రజలు కలిసికట్టుగా ముందుకు నడవాలన్నారు.
0 Reviews:
Post a Comment