ప్రముఖ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారంటూ మీడియాలో కధనాలు రావడం ఆశ్చర్యంగానే ఉంది. సికింద్రాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జయసుధ అక్కడ కాంగ్రెస్ లో వర్గ పోరును ఎదుర్కుంటున్నారు. ఒక దశలో రాజకీయాలకు గుడ్ బై చెబుదామని కూడ అనుకున్నారు.కాని కారణం ఏదైనా కాని టిఆర్ఎస్ నాయకత్వంతో ఆమె మంతనాలు జరుపుతున్నారట. రాయబారుల ద్వారా టిఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి నుంచి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారట.అక్కడ సీమాంద్రకు చెందివవారు ఎక్కువగా ఉంటున్నందున జయసుధను పార్టీలోకి తీసుకుంటే బాగానే ఉంటుందని కొందరు భావిస్తున్నారు.టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతి ని కాంగ్రెస్ కు దగ్గరైన నేపద్యంలో జయసుధను తీసుకోవడం ద్వారా దెబ్బకు దెబ్బ తీస్తారన్నది సారాంశంగా ఉంది.ఇది నిజం అయ్యే అవకాశం ఉందా?రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment