వచ్చే ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని టిడిపి మాజీ నేత, యువవేదిక,జనపాలన సంస్థ అదినేత పాలెం శ్రీకాంతరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడు కోట్లు, లోక్ సభ నియోజకవర్గానికి ఇరవై కోట్లు ఖర్చు చేయాలని నేతలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుతో నోటుకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. అవినీతి రాజకీయాలను అంతం చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్నికల్లో ధనస్వామ్యాన్ని అడ్డుకోవడంలో భాగంగానే జనపాలన పేరుతో సామాజిక రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశామన్నారు.అయితే తాను కడప లోక్ సభ కు టిడిపి పక్షాన పోటీచేసినప్పుడు ఎంత ఖర్చు అయింది?ఎలా నిధులు వచ్చాయి?దానివల్ల ఏమి జరిగింది?ఇతర పార్టీలు ఎలా ఖర్చు పెడుతున్నాయి? మొదలైనవాటిని స్వీయానుభవంతో చెబితే బాగుంటుంది కదా!
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment