Contact us

జగన్ కి మరో షాక్ అంటున్న అదే మీడియా  !
వైఎస్సార్‌సీపీ పార్టీకి మరోషాక్ అంటూ ఆంధ్రజ్యోతి మరో వార్తను వేసింది . ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లుగా ,ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌తో ఎస్పీవై రెడ్డి భేటీ అయ్యారని వ్రాసింది . కొన్ని రోజులుగా కిరణ్‌తో టచ్‌లో ఉంటున్న ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు , ఈ విషయం
పై రెండు రోజులు క్రితం ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసి చర్చించినట్లు
వ్రాసింది.
ఐతే  తనపై కొన్ని టీవీ చానెళ్లు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నాయని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. అది సరైన పద్ధతి కాదని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసే ముందుకు వెళుతున్నానని....మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఎస్పీవై రెడ్డి తెలిపారు.
తనును మరోసారి వివాదాల్లోకి లాగవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని.. తన వ్యక్తిగత పనిపై సీఎం కార్యదర్శిని కలిసేందుకు వెళ్లినట్లు ఎస్పీవై రెడ్డి తెలిపారు. తన నిజాయితీని శంకించాల్సిన పనిలేదని ..మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డే ప్రోత్సహించారన్నారు

0 Reviews:

Post a Comment