Contact us

 రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!



కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

0 Reviews:

Post a Comment