మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సరదాగా చేసిన వ్యాఖ్య ఆయనను ఇరుకన పడేసింది.టిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు,అలాగే ఎమ్.ఐ.ఎమ్.నేత అక్బరుద్దీన్ ఒవైసీల వద్ద సరదాగా ఓటు వేస్తే ఓల్వో బస్ ఇస్తానన్న మాటలను ఆసరగా చేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి తాము మద్దతు ఇవ్వబోమని హెచ్చరించారు. జెసికి ఎలా మద్దతు ఇస్తారని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ కి వ్యతిరేకంగా వెళితే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. దానిపై ఉగ్రనరసింహా రెడ్డి బుధవారం నాడు జెసి చేసిన ఓల్వో బస్ వ్యాఖ్యలను ఆసరగా చేసుకున్నారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ కెటిఆర్ తనను సరదాగా రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేస్తే ఓల్వో బస్ ఇస్తారా అంటే ఇస్తానని అన్నానని, అలా ఎందుకు జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా తనకు మద్దతు ఇచ్చేవారు అపార్ధం చేసుకుంటే మన్నించాలని అన్నారు.ఓల్వో బస్ పర్మిట్ లేకుండా ఏమి చేసుకుంటారని,దానిని నిర్వహించడమే పెద్ద సమస్య అని ఆయన అన్నారు

Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment