గుంటూరు, జనవరి 23 : కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని...బాపట్ల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు.గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఎస్సీ,ఎస్టీ నిధులు మంజూరుకావడం లేదని, నిధులు కోరితే ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై పనబాక అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనకు సహకరించడం లేదని, వారి సహకారం ఉంటే బాపట్ల నియోజవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని పనబాక లక్ష్మి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment