Contact us

ఫిబ్రవరి మూడో వారం లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
శాసనసభలో విభజన బిల్లు తిరస్కార తీర్మానం ప్రహసనమే అని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనల విరుద్దంగా తీర్మానం చేశారని ఆయన అన్నారు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా చేసిందా అని ఆయన ప్రశ్నించారు.అది తొండి తీర్మానం ,ఇంత విభజన తర్వాత కలిసి ఉండడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ పై చిట్టచివరిగా నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని గుర్తించాలని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బిల్లును పార్లమెంటు
ఆమోదించడం జరుగుతుందని, ఫిబ్రవరి మూడో వారం లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ప్రకటించారు.ఈలోగా తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేశామని గొప్పలు చెప్పడానికే పనికి వస్తుందని జైపాల్ రెడ్డి అన్నారు.

0 Reviews:

Post a Comment