Contact us

YS Jagan Pays Tribute to Akkineni Nageswara Rao
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొంటున్న జగన్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బుధవారం రాత్రికి హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి నాగేశ్వరరావు పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న నాగేశ్వరరావు కుమారుడు అగ్రహీరో అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్య, ఇతర కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు.

అక్కినేని మరణవార్త తెలియగానే జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయమే విజయమ్మ వెళ్లి అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించారు. వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మహానటుడు అక్కినేని మరణం వల్ల సమైక్య శంఖారావం యాత్రను జగన్ తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు ఉదయం జగన్ మళ్లీ చిత్తూరు వెళ్లి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగిస్తారు.








0 Reviews:

Post a Comment