రాజకీయ నాయకులంతా అంతా అంతిమంగా అధికారం కోసమే పోరాడతారు. ఏదో విధంగా పీఠంపై కూర్చొవాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వారు ప్రజలను ఆకట్టుకోవడాని వేస్తున్న వేషాలకు లెక్కేలేదు. అలాంటి వేషాల్లో ఒక్కో నేతది ఒక్కో తీరు. ఉదాహరణకు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న శ్రీమాన్ చంద్రబాబు నాయుడుగారినే తీసుకొంటే ఆయన ఒక అభిప్రాయంతో ఉన్నాడు. పదేళ్ల కిందట రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తాము అని చెప్పి తెలుగుదేశం అధికార పీఠాన్ని కదిలించాడు కాబట్టి... ప్రజలు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఓట్లు వేస్తారని బాబు భావిస్తున్నాడు.
అందుకే ఎడాపెడా ఉచిత హామీలు ఇస్తున్నాడు. 2009 ఎన్నికల ముందు ఇలాగే హామీలు ఇచ్చి బోల్తాపడినా బాబుకు బుద్ధి రాలేదు. మళ్లీ నిరుద్యోగ భత్యం, రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని చెబుతున్నాడు. ఒకనాడు గొప్ప సంస్కరణ వాది అయిన చంద్రబాబు ఇప్పుడు అడ్డగోలుగా ఉచిత హామీలు ఇచ్చేస్తున్నాడు. తాను అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఉచితంగా ఇచ్చి అదనంగా నెల నెలా డబ్బు కూడా ఇస్తానంటున్నాడు.
మరి బాబు హామీల పరంపరను చూసి జగన్ ఎక్కడ రెచ్చిపోతాడో.. అని చాలా మంది భయపడ్డారు. చంద్రబాబు రైతుల లోన్లు మాఫీ చేస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, డ్వాక్రాలోన్లు రద్దు చేస్తాం... అని అంటే.. జగన్ బాబు అంతకంటే పెద్ద పెద్ద హామీలు ఎక్కడ ఇస్తాడో.. బాబు చేసేవీ చేయడంతో పాటు వ్యవస్థను మరింత నాశనం చేసే హామీలను ఎక్కడ ఇస్తాడో అని కొంతమంది భయపడ్డారు. అయితే వారందరికీ జగన్ రిలీఫ్ ను ఇచ్చాడు.
తమ పార్టీ ప్లీనరీలో జగన్ కొన్ని ఉచిత హామీలను ఇచ్చినప్పటికీ చంద్రబాబు స్థాయిలో కూడా లేవవి. రైతుల రుణాలను కూడా మాఫీ చేయలేనని చెప్పేశాడు జగన్. డ్వాక్రారుణాల వరకూ మాఫీ చేసినా, లక్షా 27 వేల కోట్ల రూపాయల విలువ చేసే రైతుల రుణాలను మాఫీ చేయలేమని చెబుతూ అది సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశాడు. ఈ విషయంలో జగన్ కచ్చితంగా అభినందనలకు అర్హుడేనని సంస్కరణ వాదులు అంటున్నారు.
అయితే చంద్రబాబు, ఆయన అభిమానులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం తరం ప్రజల్లో బాగా అవేర్ నెస్ పెరిగింది. ప్రజలు కోరుకొంటున్నది కేవలం అవినీతి వ్యతిరేక వ్యవస్థనే కాదు, చక్కగా పనిచేసే వ్యవస్థను కూడా. బాబు రుణమాఫీ చేస్తే దాని ప్రభావం తమ మీద కూడా పడుతుంది కదా.. అని చదువుకొన్న యువతీ యువకులు భావిస్తున్నారు. ఉచితం అనేది వ్యవస్థను నాశనం చేస్తుందని, ప్రజలు కట్టే పన్నులను దుర్వినియోగం చేస్తుందని భావించే తరం ఇది. మరి ఇటువంటి సమయంలో బాబు ఇచ్చిన ఉచిత హామీలు తెలుగుదేశం ఓట్లను మైనస్ చేస్తాయి తప్ప ప్లస్ చేయవు. ఉచిత హామీల తో పడే ఓట్ల కన్నా, పడకుండా పోయే ఓట్లే ఎక్కువగా ఉంటాయని అనడానికి సందేహించనక్కర్లేదు! ఈ విషయంలో జగన్ పనే బావుందని చెప్పవచ్చు!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/babu-dari-lo-nadavananduku-50227.html#sthash.bTtkoL0Q.dpuf
0 Reviews:
Post a Comment