Contact us

సీమాంద్ర ప్యాకేజీ ఫర్వాలేదా!
తెలంగాణ బిల్లుపై ఎట్టకేలకు ప్రధాని రాజ్యసభలో మాట్లాడారు.సీమాంద్రకు ప్యాకేజీని ఆయన ప్రకటించారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. అయిదు సంవత్సరాలపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి - బుంధేల్ ఖండ్ తరహాలో సీమాంధ్రకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.. రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఆదాయం, ఆస్తులు, సిబ్బంది పంపిణీ తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ , పునరావాస బాధ్యతలను కూడా కేంద్రమే చేపడుతుందని ప్రధాని తెలిపారు.ఇక ప్యాకేజీ పై చర్చలు ఆరంభమవుతాయి. ఈ ప్యాకేజీ బాగుందా?లేదా అన్నది నిర్ణయించడానికి పూర్తి వివరాలు తెలిస్తే ఒక అభిప్రాయానికి రావచ్చు. అయితే పైకి చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. అయితే సీమాంధ్రకు రెవెన్యూ లోటు ను కేంద్రం భరిస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. కాని దానిపై హామీ వచ్చినట్లు లేదు.

0 Reviews:

Post a Comment