Contact us

వీధినాటకం పేరుతో అశ్లీల నృత్యాలు!
వీధినాటకం పేరుతో అశ్లీల నృత్యాలు!
కుందుర్పి: ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రదర్శించిన వీధి నాటకం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ , సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పిలేపల్లిలో శనివారం అర్ధరాత్రి ‘బెబ్బులి రాయుడు’ వీధి నాటకం ప్రదర్శించారు. అయితే కళాకారులు అశ్లీల నృ త్యాలు చేస్తున్నట్లు కుందుర్పి పోలీసుస్టేషన్‌కు సమాచారం అందింది.

ఎస్‌ఐ శ్రీని వాసులు స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు. తొక్కిసలాటలో ఓ మహిళ సృహ తప్పి పడిపోవడంతో ఆగ్రహించిన జనంలో కొందరు పో లీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. కొందరు ఆకతాయిలు పోలీసులకు చెం దిన రెండు బైక్‌లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న సీఐ వం శీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడిలో 40 మంది వరకు పాల్గొన్నట్లు తేలడంతో..వారిలో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

0 Reviews:

Post a Comment