Contact us

విభజన ఆపివేయాలని సుప్రీంలో ఏడు పిటిషన్లు
విభజన ఆపివేయాలని సుప్రీంలో ఏడు పిటిషన్లు
న్యూఢిల్లీ :  రాష్ట్ర విభజన నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి.  ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందంటూ వైఎస్ఆర్ సీపీ నేత సోమయాజులు వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది.
మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణను త్వరితగతిన చేపట్టాలని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ పిటిషన్లు అన్ని శుక్రవారం విచారణకు రానున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీ వేదికగా రాష్ట్ర విభజన హాట్ టాపిక్‌గా మారింది.  వివిధ రాజకీయ పార్టీల నాయకులు  విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

0 Reviews:

Post a Comment