Contact us

రాజీనామా తరువాత కొత్తపార్టీపై నిర్ణయం
రాజీనామా తరువాత కొత్తపార్టీపై నిర్ణయంకిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా, కొత్త పార్టీ విషయమై  చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఆరుగురు  ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో సీఎం చర్చలు కొనసాగిస్తున్నారు.  ఎల్లుండి అసెంబ్లీ వేదికగా సిఎం మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక అక్కడ మాట్లాడటానికి కుదరకపోతే ప్రెస్‌మీట్‌ పెట్టి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.

సీఎం రాజీనామా చేస్తారంటూ మంత్రుల ప్రచారం చేస్తున్నారు. సీఎం రాజీనామాకే కట్టుబడి ఉన్నారని మంత్రి పితాని సత్యనారాయణ కూడా చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత  రెండురోజులపాటు తనతో కలిసివచ్చేవారితో మేధోమధనం జరుపుతారని తెలుస్తోంది. ఆ తరువాత కొత్తపార్టీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

0 Reviews:

Post a Comment