ఇది సాంకేతికంగా బిల్లు పెట్టినట్టు కానేకాదు. సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా బిల్లు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. పైగా బిల్లును ప్రవేశపెట్టకుండానే ‘ప్రవేశపెట్టాం’ అని చెప్పుకుంటున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. బిల్లుకు అవుననో, కాదనో చేతులెత్తకుండానే బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం సమంజసం కాదని వివరించారు. ఈ వాదనను పట్టించుకోని స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టినట్లేనని చెప్పడంతో జగన్ అక్కడినుంచి వాకౌట్ చేశారు. సస్పెండయిన ఎంపీలు లేఖలిస్తే తీసుకోబోమంటూ జగన్ ఇచ్చిన లేఖను కూడా స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. దీంతో అదే లేఖను స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా జగన్ మరోమారు పంపారు.
తొలి ఎంపీ జగనే
తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని యూపీఏ సర్కారు చెప్పుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. బిల్లును ప్రవేశపెట్టడంపై గురువారం సభలో అందరికంటే ముందుగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ ఆయనే.
0 Reviews:
Post a Comment