Contact us

టి.బిల్లును తిరస్కరించడం బీజేపీ చేతుల్లోనే ఉంది
టి.బిల్లును తిరస్కరించడం బీజేపీ చేతుల్లోనే ఉంది
శ్రీకాకుళం: టి.బిల్లును తిరస్కరించే అంశం బీజేపీ చేతిల్లోనే ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని సూచించారు.ఈ అంశంపై సోమవారం మీడియాతో మాట్లాడిన ధర్మాన..టి.బిల్లు తిరస్కరించడం బీజేపీ చేతిల్లోనే ఉందన్నారు.
 
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు దేశ వ్యాప్తంగా ఒకే వైఖరి ఉండాలని ధర్మాన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని పదే పదే చెబుతున్న బీజేపీ బిల్లును అడ్డుకుని తమ విజ్ఞతను చాటుకోవాలన్నారు.

0 Reviews:

Post a Comment