Contact us

టీడీపీలో ఎప్పుడు చేరదామా అనే తొందరే
'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం'
హైదరాబాద్: టీడీపీలో ఎప్పుడు చేరదామా అనే తొందరే  ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలో కనిపించిందని  వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  శాసనసభలో ఆనం రాజ్యంగ సాంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. బడ్జెట్‌లో వాస్తవాలు లేవని ఆయన తెలిపారు. గత ఏడాది ఏం సాధించారో చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించలేదని చెప్పారు.

ప్రభుత్వ అసమర్ధత వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురాలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం కళ్లకు కట్టినట్లుందని పేర్కొన్నారు. టీడీపీకి పీఆర్పీకి పట్టినగతే పడుతుందన్నారు.  చంద్రబాబు టీడీపీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు.

0 Reviews:

Post a Comment