సమావేశం ముగిసిన తర్వాత ఏరాసు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రోజున సీఎం రాజీనామా చేస్తారని చెప్పారు. తమ జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటామని ఏరాసు తెలిపారు. తాము ఏపార్టీలో ఉంటామన్నది త్వరలోనే తేలుస్తుందన్నారు.
పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని మరో మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు సంకేతాలు పోతాయన్న భావనతో సీఎం వెనక్కు తగ్గారని వెల్లడించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టలేదని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అంటున్నాయని టీజీ చెప్పారు.
0 Reviews:
Post a Comment