Contact us

మళ్లీ శివప్రసాద్ విచిత్ర వేషాలు

'సోనియా ఏందిరో....ఆమె పీకుడేందిరో'

తెలుగుదేశం లోక్ సభ సభ్యుడు డాక్టర్ ఎన్.శివప్రసాద్ మళ్లీ యధా ప్రకారం విచిత్ర వేషాలు వేయడం ఆరంభించారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆయన ఈసారి షర్టు విప్పి భుజంపై గొంగళి వేసుకుని నిరసన తెలిపారు. చేతిలో ఓ కర్ర పట్టుకుని ఆయన ఓ విప్లవ గీతం అందుకున్నారు.దొర ఏందిరో.. అన్న పాటనే మార్చి సోనియా ఏందిరో...ఆమె పీకుడేందిరో పేరడీ రూపంలో విభజన చేస్తున్న కాంగ్రెస్‌, సోనియాపై విరుచుకుపడ్డారు. గతంలో రకరకాల వేషాలు వేసి మీడియా దృష్టిని ,సహ ఎమ్.పిల దృష్టిని ఆకర్షించిన శివప్రసాద్ ఇప్పుడు కూడా అదే తరహాలో వేషాలు ఆరంభించారు. విశేషం ఏమిటంటే ఈయన కూడ టిడిపి ని తన విదానం మార్చుకోవాలని ఎన్నడూ కోరకపోవడం.

0 Reviews:

Post a Comment