బ్రిటన్‌కు చెందిన షాన్... తన భార్యను అమ్మేస్తున్నానంటూ ఆమె ఫొటోలను ఈబే సైటులో అప్‌డేట్ చేశాడు. ‘నచ్చిన వాళ్లు కొనుక్కోండి, మంచి తరుణం మించిన దొరకదు’ అంటూ హడావుడి మొదలెట్టాడు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికి ఆమెను ఇచ్చేస్తానన్నాడు. విచిత్రం ఏమిటంటే... షాన్ తన భార్యను వేలానికి పెట్టిన కొన్ని గంటల్లోనే ఆమె కోసం 50 మంది మగ మహారాజులు బిడ్డింగ్ చేశారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియా కంట పడింది. ఇంకేముంది... దీని గురించి కథనాల మీద కథనాలు వేయడం మొదలైంది.
దాంతో షాన్ అడ్డంగా బుక్కయ్యాడు. ‘ఏదో సరదాగా ఈ పని చేశాను. పైగా ఈ విషయం నా భార్యకు కూడా తెలుసు’ అంటూ బిక్కమొగం వేశాడు షాన్. ఆ విషయాన్ని అతడి భార్యకూడా ధ్రువీకరించింది. వీరి సరదా గురించి బిడ్డింగ్ చేసిన వారికి చెబితే... ‘మేం మాత్రం సీరియస్‌గా ట్రై చేశామా ఏంటి, సరదాగానే చేశాం’ అంటూ తేల్చేశారు వాళ్లు!
0 Reviews:
Post a Comment