Contact us

మర చీమలతో భారీ భవంతులనే కట్టేయించొచ్చంటున్నారు
ఇల్లు కట్టే చీమలు..
చీమలు పుట్టలు పెడతాయి.. మరి మర చీమలు ఏం చేస్తాయి? మన కోసం ఇళ్లే కట్టేస్తాయి. చిత్రంలో మర చీమలను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. చూశారుగా.. ఎంచక్కా ఇవి ఎలా చిన్నచిన్న నిర్మాణాలను కట్టేస్తున్నాయో.. ప్రస్తుతానికి ఇవి చిన్నచిన్న నిర్మాణాలను కడుతున్నా.. మరిన్ని పరిశోధనలతో భవిష్యత్తులో ఇలాంటి మర చీమలతో భారీ భవంతులనే కట్టేయించొచ్చంటున్నారు ప్రొఫెసర్ రాధికా నాగ్‌పాల్. భారత సంతతికి చెందిన రాధిక హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

0 Reviews:

Post a Comment