Contact us

గాడ్ బ్లెస్ యూ జగన్!
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఎదురుపడితే ఎలా ఉంటుందనే ఉత్సుకతకు తెర పడింది. జగన్ కూడా తమ పార్టీ డిఎన్‌ఎ అన్నందుకు వైయస్ జగన్ దిగ్విజయ్ సింగ్‌పై విరుచుకుపడిన విషయం గుర్తుకు రాక తప్పదేమో.. దిగ్విజయ్ సింగ్ కనిపిస్తే చెంప పగులగొట్టండి అని జగన్ అప్పట్లో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అయితే, జగన్ మంగళవారంనాడు దిగ్విజయ్ సింగ్ జగన్‌కు పార్లమెంటు ఆవరణలో ఎదు
దిగ్విజయ్ పలకరింపు: 'గాడ్ బ్లెస్ యూ జగన్!'
రు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఉభయ సభలూ వాయిదా పడిన తర్వాత దిగ్విజయ్ పార్లమెంటు సెంట్రల్ హాలు నుంచి జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ బయటకు వస్తున్నారు. అదే సమయంలో జగన్ తన పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, నాయకుడు బాలశౌరిలను వెంటబెట్టుకుని లోపలికి వెళుతున్నారు. ఈ స్థితిలో దిగ్విజయ్‌ను దాటుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్‌కు ఎదురయ్యింది. మీడియా ప్రతినిధులతో పాటు నడిచి వస్తున్న దిగ్విజయ్‌ను చూడగానే జగన్‌కు ఏం చేయాలో, మాట్లాడాలో తెలియలేదు. డిగ్గీరాజా మాత్రం ఆయన్ను చూడగానే.. 'హలో జగన్' అని పలకరించారు. దీంతో జగన్ 'తనదైన శైలి'లో నవ్వుతూ దిగ్విజయ్‌కు నమస్కరించి, కరచాలనం చేశారు. 'ఆల్ ఈజ్ వెల్' అని దిగ్విజయ్ అడగ్గా.. 'అంతా బాగుంది' అన్నట్లుగా నవ్వుతూ తలపంకించారు. దాంతో దిగ్విజయ్ సింగ్ సరిపెట్టకుండా - 'గాడ్ బ్లెస్ యూ జగన్' అని దీవించారు. వెంటనే జగన్ ఏదో పని ఉన్నట్లుగా అక్కడి నుంచి హడావుడిగా ముందుకు వెళ్లిపోయారు.

0 Reviews:

Post a Comment