ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన ఆంధ్రా కృపారావుకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గౌరీదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గౌరీదేవి ప్రవర్తన బాగాలేదంటూ భర్త దూరమయ్యాడు. పిల్లలు తల్లి దగ్గరే ఉంటున్నారు.
కొంతకాలం దూరంగా ఉన్న గౌరీదేవి భర్తకు ఫోన్ చేసి తనకు రూ. 3 లక్షల అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చాలని ప్రాధేయపడింది. నీ కిడ్నీ అమ్మితే రూ. 5లక్షలు ఇస్తారని, దానితో సమస్యల నుంచి గట్టెక్కుతామని నమ్మబలికింది. పిల్లల కోసం కృపారావు కూడా సరేనన్నాడు. దీంతో అక్టోబర్‌లో వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ అమ్మేసుకున్నాడు. వచ్చిన రూ.5లక్షలు తీసుకుని భర్తను అక్కడే వదిలేసి గౌరీదేవి, దళారి ఉడాయించారు.
చివరకు వైద్యులు బయటకు గెంటేయడంతో కృపారావు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌కు పదిరోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్ సీఐని కలవగా మాకు సంబంధం లేదని వైజాగ్‌లోనే కేసు పెట్టాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక చివరకు మీడియాను ఆశ్రయించాడు.
0 Reviews:
Post a Comment