Contact us

అమ్మ ఎంత నేర్చుకుందో..జగన్ సింహమే


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్లీనరీలో తన సోదరుడు జగన్ సమక్షంలో షర్మిల ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. జగన్ ను, విజయమ్మ గురించి సభికులను హత్తుకునేలా మాట్లాడారు.
మీ రాజన్న కూతురు.జగన్నన్న చెల్లెల్లు మనస్పూర్తిగా నమస్కరించుకుంటోంది. కష్టకాలంలో మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు అంటారు. అలాంటిది నాలుగేళ్లుగా నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి మీ అందరూ కష్టాలలో పాలుపంచుకున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నే బలపరిచారు.కులాలు,ప్రాంతాలు,మతాలకు అతీతంగా అందరు కలిసి పనిచేస్తున్నారు. దీనికోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా నమస్కరించుకుంటున్నాం. విజయమ్మ ..అమ్మ ఎంత నేర్చుకుందో, తనను తాను ఎంత మార్చుకుందో ఆలోచిస్తే అమ్మేనా అనిపిస్తుంది.నాన్న ఉన్నప్నపుడు తన బిడ్డలే తన లోకం అని ఉంది. నాన్న వెళ్లిపోయాక అమ్మ ఈ ప్రజలే తన బిడ్డలు అని ఎంత చేసిందో తలచుకుంటే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అన్న సంగతి చూస్తే ఓదార్పు యాత్రకు వెళితే కేసులు పెట్టారు.సిబిఐని అడ్డు పెట్టుకుని వేదించారు.వేధించారు.అబద్దపు కేసులు బనాయించారు.మహానేత పేరు కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. జగనన్నను జైలుపాలుచేశారు.అమాయకుడని తెలిసి కడూఆ ఆయన జీవితాన్ని బలి చేయాలని చూశారు.ఇంత జరుగుతున్నా, ఆత్మ విశ్వాసం సడలలేదు. బోనులో ఉన్నా సింహం సింహమేనని జగనన్న రుజువు చేసుకున్నారు.చిత్రమేమిటంటే జగన్ లో ఇంత నిబ్బరం ఉందని నేను అనుకోలేదు. అత్యంత శక్తివంతులతో పోరాడుతున్నానని తెలుసు.దుర్మార్గపు శక్తిమంతులతో పోరాడుతున్నానని తెలుసు. అయినా జంకలేదు. ఒక్క క్షణం కూడా భయపడలేదు.కలలో కూడా భయపడలేదు.ఊహలో కూడా రాజీపడలేదు. ఇంత దమ్ము ఉన్నవాడు కనుకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఒడుదుడుకు లు వచ్చినా ఇంత ప్రజాదరణతో ముందుకు వెళ్లగలిగింది.వై.ఎస్..చనిపోతూ ధీమా కలిగిన జగన్ ను ఇచ్చి వెళ్లారని అర్ధం అయింది.పాదయాత్రలో వై.ఎస్.గురించి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో అర్ధం అయింది. ..ఇలా షర్మిల తన ప్రసంగం కొనసాగించింది. మొదటి భాగం అంతా తల్లి విజయమ్మ, సోదరుడు జగన్ గురించి మాట్లాడిన తీరులో రాజకీయ నాయకురాలిగా షర్మిల ఎదుగుతున్నారన్న భావన కలుగుతుంది.వచ్చే ఎన్నికల ప్రచారానికి ఆమె సిద్దమవుతున్నారని అర్ధం అవుతుంది

0 Reviews:

Post a Comment