Contact us

జగన్ కేసులో 863 కోట్ల ఆస్తుల జప్తు
వైయస్ జగన్ కేసు: రూ.863 కోట్ల ఆస్తుల జప్తు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరో భారీ జప్తునకు దిగింది. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ వ్యవహారంలో రూ. 863 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది. ఈ మేరకు ఈడి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ఆస్తులతో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను జప్తు చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు చెందిన కార్మైల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన సుగుణి కన్‌స్ట్రక్షన్స్, బీటా అవెన్యూస్, జీ2 కార్పోరేట్, అల్ఫా విల్లాస్ తదితర సంస్థల
కు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. ఈడి జప్తు చేసిన ఆస్తుల్లో జగన్‌కు చెందిన ఇందిరా టెలివిజన్ వంద కోట్ల షేర్లు ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్‌కు చందిన 366 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.11 కోట్ల విలువ చేసే జగన్ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసింది. సండూర్‌ పవర్‌లోని 57 కోట్ల జగన్ వాటాలను కూడా జప్తు చేసింది. నిమ్మగడ్డకు చెందిన సుగుణి కన్‌స్ట్రక్షన్‌కు చెందిన 7 కోట్ల రూపాయల ఆస్తులను, భూమిని జప్తు చేసింది. గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 44 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, సిలికాన్ బిల్డర్స్‌కు చందిన 44 కోట్ల రూపాయల ఆస్తులను ఈడి జప్తు చేసింది. వాన్‌పిక్ పోర్టుకు చెందిన 561 ఎకరాల భూమిని, వాన్‌పిక్ ప్రాజెక్టుకు చెందిన 865 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసులో పిఎంఎల్ఎ చట్టం కింద విచారణ జరుగుతుందని ఈడి స్పష్టం చేసింది.

0 Reviews:

Post a Comment