దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని వై ఎస్ జగన్ అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రాత్రి 8 గంటలకు జరిగిన వైఎస్ఆర్ సిపి జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అభివృద్ధి చేశారు కాబట్టే ప్రతి ఒక్కరి గుండెలోతుల్లోఆయన ఉన్నారన్నారు. చదువు కోసం పేదవాడు అప్పులపాలు కాగూడదని వైఎస్ తపించారు. పేదవాడు అప్పులపాలు కాకూడదని 108 ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సిపి తెలంగాణలో కూడా ఉంటుందని, తెలంగాణ లో కుడా అత్యధిక సంఖ్యలో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment