- 80 లక్షల ముడుపుల ఊసెత్తని టీఆర్‌ఎస్
- రఘునందన్ ఆరోపణలను ఖండించని కేసిఆర్
- తూ తూ మం్త్రంగానే నేతల ఖండనలు
హైదరాబాద్, మేజర్ న్యూస్: టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావుపై ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగు చర్చలు జరుగుతున్నాయి. పద్మాలయ స్టుడియో భూముల వ్యవహారంలో 80 లక్షల రూపాయలు ముడు పులు హరీష్‌రావుకు ముట్టాయని, దీనికి విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక సినీ నిర్మాత కూడా ఇందుకు సాక్షులని, త్వరలోనే వీడియో సీడీలు, సీసీ కెమెరా పూటేజీలు కూడా మీడియా ముఖంగా బహిర్గతం చేస్తానని రఘునందన్ రావు స్పష్టం చేస్తున్నారు. ఈ ముడుపుల బాగోతానికి విజయశాంతి ఇల్లే వేదిక కావడం విశేషమంటూ రఘు నందన్ రావు కుండబద్దలుకొట్టారు. తిరుపతిలో ఇచ్చిన డబ్బులపై స్పందించిన హరీష్ రావు అదే విజయశాంతి ఇంట్లో 80 లక్షల రూపాయలు తీసుకున్నట్లు రఘునం దన్ రావు చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించలేదనే చెప్పాలి. డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయ టపెట్టాలని హరీష్‌రావు డిమాండ్ చేసినప్పటికీ పాపం హరీష్ రావుకు ఆ పార్టీ నేతలేవరూ అండగా నిలవక పోవడం గమనార్హం. పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కవిత, కేటీఆర్‌లు మాట్లాడినప్పటికీ ఆలా పైపైన స్పశించి అసలు విషయాన్ని వదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. గతంలో పార్టీ ఎంపీగా ఉన్న ఆలే నరేంద్రపై నకిలీ పాస్ పోర్టు స్కాం ఆరోపణలు రావడంతోనే ఆయన్ను పార్టీ నుండి సాగనంపిన కేసిఆర్ ఇప్పుడు తన కుటుంబ సభ్యులపై వస్తే ఎందుకు స్పందించడం లేదం టున్నారు. నరేంద్రను పార్టీ నుండి బయటికి పంపించి నప్పుడు కూడా పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా కేసిఆర్ వాటిని లెక్కలోకి తీసుకోలేదు, పైగా తాను అవి నీతికి వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొత్సహించేది లేదని కేసిఆర్ ఖరాఖండిగా చెప్పారని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రఘునందన్ హరీష్ రావుపై ఇన్ని ఆరోపణలు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మౌనం అర్ధాంగీకారమన్నట్లు ఎవరూ ఏమీ మాట్లాడక పోతే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తుందని, ఇది అంతిమంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచే ప్రమా దం ఉందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్లు సమాచారం. కాగా ఈటెల, కవిత, కేటీఆర్ ఎవరు మాట్లాడినా రఘునందన్ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
courtesy:suryaa
- రఘునందన్ ఆరోపణలను ఖండించని కేసిఆర్
- తూ తూ మం్త్రంగానే నేతల ఖండనలు

courtesy:suryaa
0 Reviews:
Post a Comment