రాష్ట్రంలో సంచలన కేసులకు తెరలేపి సాధరణ ప్రజల్లో కూడా సీబీఐకే ఒక గుర్తింపు తెచ్చిన సీబీఐ జేడి లక్ష్మీనారాయణ బదిలీ కావటంతో జగన్ శిబిరం ఖుషీ ఖుషీగా ఉంది. అవినీతి , అక్రమ ఆస్తుల అభియోగం కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత కడప ఎంపి జగన్‌ను సీబీఐ జేడి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. దీంతో జగన్ ఏడాదికాంలంగా చంచల్ గూడ జైల్లో ఉండిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తనయుడుగానే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా , దినపత్రిక అధిపతిగా ఉన్న జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు తరలించటం ఒక సంచలనమైతే, ఏడాది కాలంగా కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డు కోవటం మరో సంచలనంగా చెబుతున్నారు. రాష్ట్రానికి చెం దిన లక్ష్మీనారాయణ తెలుగువారు కావటంతో సహజ ంగానే ఆయనపైకి అందరి దృష్టి మళ్ళింది. ఆయన కూడా మీడియాతో తరుచూ మాట్లాడుతుండటంతో మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు.
జగన్ కేసు తెర పైకి వచ్చిన ప్రతిసారి సీబీఐ ఈసారి ఎలా వ్యవహరిస్తుం దని ప్రజల్లో ఉత్కంఠ నెలకునేదంటే అది లక్ష్మీనారాయణ వ్యవహారశైలివల్లనే అన్న అభిప్రాయాలు లేకపోలేదు. రాష్ట్రంలో సుమారు ఏడేళ్ళ పాటు సీబీఐ జేడిగా పనిచేసిన లక్ష్మీ నారయణ సత్యం రామలింగరాజు వంటి ఎన్నో కేసు లను చేదించారు.గనుల యజమాని గాలి జనార్ధన్‌రెడ్డిని బెంగూళూరులో అరెస్ట్‌చేసి తీసుకురావటంద్వారా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించారు. జగన్‌ను అరెస్ట్ చేయటం ద్వారా సాధరణ ప్రజల్లో సైతం సీబీఐ పేరుతో పాటు లక్ష్మీనారాయణ పేరు నానుతూ వచ్చింది. జగన్ పట్ల సీబీఐ ప్రత్యేకించి జేడి లక్ష్మీనారాయణ కక్ష పూరి తంగా వ్యవహరిస్తున్నారని, అధికారపార్టీ పెద్దలు చెప్పిన ట్టు నడుచుకుంటున్నారని జగన్ వర్గీయుల నుంచి విమర్శ లు వచ్చాయి. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ ,కొండా సురేఖ, అంబటి రాంబాబు, గ ట్టు రామచంద్రరావు వంటి నాయకులు మీడియా సమావేశాల్లో సీబీఐ జేడినే లక్ష్యం గా చేసుకుని విమర్శలు చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. తనపై ఎవరూ ఎన్ని విమర్శలు చేసినా ఎన్నిసార్లు విమర్శలు చేసినా లక్ష్మీ నారాయణ వాటికి స్పందించేవారు కాదు. చట్టం తన పని తాను చేసుకుపో తుందన్న తరహాలో తనపై వచ్చే విమర్శలకు చిరునవ్వే సమాధానంగా చెప్పేవారు. రాష్ట్రం లో దివంగత వైఎస్ కుటుంబానికి ప్రత్యేకించి జగన్ వర్గీ యులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన లక్ష్మీ నారాయణ బడిలీ వార్త జగన్ శిబిరంలో ఆనందోత్సాహా లను నింపుతోంది. పలువురు వైస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నాయ కులు బదిలీపై సంబరాలు చేసుకున్నట్టు సమాచారం.
courtesy: suryaa
0 Reviews:
Post a Comment