
సిబిఐ మాదిరే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా పంజరంలో చిలక మాదిరే వ్యవహరించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.ఆ పార్టీ కి మద్దతు ఇచ్చి అనర్హత వేటు పడిన చింతలపూడి ఎమ్మెల్యే ఎమ్.రాజేశ్ దీనిపై మాట్లాడుతూ తాము విప్ ఉల్లంఘించామని పదే,పదే చెప్పినా,వెంటనే వేటు వేయాలని కోరినా స్పీకర్ విచారణ పేరుతో జాప్యం చేశారని ఆయన అన్నారు.దీనివల్ల ఉప ఎన్నికలు జరగని పరిస్థితి ఏర్పడిందని రాజేష్ చెప్పారు.తెలుగుదేశం, కాంగ్రెస్ లు కుమ్మక్కు చేసి ఈ వేటు వేశాయని, ఉప ఎన్నికలు రాకుండా వేటు వేయడం మాత్రం బాధ కలిగించిందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.కాగా స్పీకర్ కార్యాలయం మాత్రం స్పీకర్ నాదెండ్ల మనోహర్ పద్దతి ప్రకారం విచారణ జరిపారని,ఇందులో కావాలని చేసింది లేదని స్పష్టం చేస్తోంది.స్పీకర్ మనోహర్ ఇప్పటివరకు మొత్తం ముప్పైనాలుగు మందిని అనర్హులను వేటు వేసి రికార్డు సృష్టించారు.
0 Reviews:
Post a Comment