
రాజకీయాలలో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందో కచ్చితంగా చెప్పడం కష్టం.కాకపోతే ఒక ఘటన మొదలయ్యాక దాని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందో ఊహించవచ్చు.రెండువేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ అక్కడ జరిగిన గొడవలతో తీవ్రమైన విమర్శలకు గురి అయ్యారు. అప్పట్లో వాజ్ పేయి చేసిన వ్యాఖ్యలతో మోడీ పదవి పోతుందేమోనని అనుకున్నారు. కాని అద్వాని కాని , ఆయన మనుషులు కాని మోడీకి అండగా నిలబడ్డారు. దాంతో మోడీ సేఫ్ అయ్యారు.కాని దశాబ్దం తర్వాత మోడీ అబిమానులు ఏకంగా అద్వాని ఇంటి వద్ద నిరసన తెలపడం అంటే బిజెపికి సంబందించినంతవరకు తీవ్రమైన పరిణామమే.బిజెపి ఆవిర్భానికి కారకులైన ఇద్దరు నేతలలో ఒకరైన అద్వానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అద్వాని గోవాకు వెళ్లకపోవడంపై మోడీ మద్దతుదారులు ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు.ఇది బిజెపికి ఇబ్బంది కలిగించింది. అయితే అనారోగ్యంతోనే అద్వాని గోవా వెళ్లలేదని బిజెపి వివరణ ఇచ్చింది. అది వేరే విషయం.కాగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసం ఎదుట నరేంద్ర మోడి మద్దతుదారులు నిరసన తెలపడాన్ని శివసేన ఖండించడం గమనించదగిన అంశంగా ఉంది.దేశరాజకీయాల్లో అద్వానీ సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, సైద్ధాంతిక రాజకీయాలను ఆయన పాటిస్తున్నారని శివసేన నాయకుడు సంజయ్ రాత్ అన్నారు.శివసేన మోడీని వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో అద్వానికి అండగా నిలుస్తోందనుకోవాలి.
source:kommineni
0 Reviews:
Post a Comment