Contact us

2008లోనే తెలంగాణకు అనుకూలం అని చెప్పాం
తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా చర్యలు చేపట్టాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కోరారు.హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి మూడు,నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, మరి ఆంద్ర ప్రదేశ్ లో ఇలాంటి రాజధాని నగరం నిర్మించాలని ఆయన అన్నారు. ఇలాంటి నగరాన్ని అభివృద్ది చేయగలమా అన్న ఆవేదన ఉందని అన్నారు.వారి ఉపాధి అవకాశాల మీద ఆందోళన ఉందని, నీటి విషయాలపై అనుమానాలు ఉన్నాయని అవన్ని నివృత్తి చేయాలని ఆయన అన్నారు.ఏదో ఒక మాట  ెప్పి,వదలిపెడితే కుదరదని, ఆరు నెలలు ఉండి వీరు పోతారని, ఆ తర్వాత సంగతి ఏమిటన్నది ఇబ్బంది లేకుండా చట్టంలోనే పెట్టాలని అన్నారు.కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్మాణం జరగాలని అన్నారు.
 విద్వేషాలు ఉండకుండా రెండు రాష్ట్రాలలో అబివృద్ది జరగాలని అన్నారు.పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వడం సరైనదేనని, అలాగే ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని అన్నారు.హైదరాబాద్ రెండో రాజధాని చేయాలని గతంలో అంబెద్కర్ చెప్పారని అన్నారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ లేఖ ఇచ్చామని అన్నారు.విడిపోయినా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని అన్నారు.

అయితే 2008లోనే తెలంగాణకు తమ పార్టీ అనుకూలమే చెప్పిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరు ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే లేఖ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. రెండు ప్రాంతాలవారికి న్యాయం చేయాలి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశం పరిష్కారానికి ఆత్మహత్యలు మార్గం కాదన్నారు. ప్రజలంతా సమయమనం పాటించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని ఆయన తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా కల్పించాలన్నారు.

0 Reviews:

Post a Comment