రాష్ట్ర రాజధాని సంగతి ఎందుకు తేల్చడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.స్పష్టత లేని విభజన తెలంగాణ లోని సీట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్ప మరొకటి కాదు. తండ్రి వలే అందరికి న్యాయం చేయాలని కోరాం తప్ప, వారిష్టం వచ్చినట్లు చేయండని కాదని అన్నారు.చంద్రబాబు మాదిరి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని తామనడం లేదని ,ఆయన నిర్ణయం తీసుకోండని చెప్పి కాళ్ల కు నమస్కారం చేసి వెళ్లిపోతామన్నారని అన్నారు.జలాల విధానంలోకాని, ఉమ్మడి రాజధాని విషయంలో కాని కనీసం కేంద్ర మంత్రులు ఎవరైనా తమకు తెలుసునని అని చెప్పారా అంబటి రాంబాబు ప్రశ్నించారు.సోనియా నవ్వారని చెప్పారు తప్ప , ఇంకొకటి తెలియదని, ఇంత అడ్డగోలుగా జరుగుతుందని తమకే తెలియదని మంత్రులు మాట్లాడుతున్నారని, వారు మాత్రం రాజీనామా చేయరట. సర్వేలలో కాంగ్రెస్ కు సీట్లు రావని తేలిందని చెప్పారు. సీట్ల, కోసం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ తో కాంగ్రెస్ బేరసారాలు కుదుర్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment