తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయిపోవడంతో పార్టీ ఉనికి ఉండదని, టిడిపి కూడా బలహీన పడుతుందని ఎమ్.ఐ.ఎమ్. అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.అంతిమంగా బిజెపి బలపడుతుందని,దానిని తాము ఎదుర్కుంటామని అన్నారు. హైదరాబాద్ లో ఎవరినైనా సెట్లర్ అని అంటే అది నేరంగా చట్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ శాఖలుంటాయని తెలిపారు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలవరం తరహాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని అసదుద్దీన్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే, అత్యధికంగా లాభపడేది బీజేపీ అనే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో బీజేపీకే లాభం అన్నారు. కొత్తరాష్ట్రాలలో టీడీపీ బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు.
0 Reviews:
Post a Comment