వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో 26 జివోల అంశానికి సంబంధించి మంత్రులు, ఐఏఎస్ అధికారులకు సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. 26 జివోల కేసులో మంత్రులు, ఐఏఎస్ అధికారులను నిందితులుగా చేర్చాలని సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు ఈ రోజు కొట్టివేసింది.
హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే చెప్పాలని పిటిషనర్‌కు సూచించింది. 26 జివోల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంత్రులు అధికారులను నిందితులుగా చేర్చాలని సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా పిటిషన్ కొట్టివేయబడింది.
0 Reviews:
Post a Comment