Contact us

రాజకీయాలలోకి రాను-అనిల్


వై.ఎస్ కుటుంబానికి చాలా అన్యాయం చేస్తున్నారని దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అల్లుడు అనిల్ అన్నారు. జగన్ ను అన్యాయంగా జైలులో పెట్టారని, అందువల్లనే ఆ కుటుంబంలోని మహిళలు జనంలోకి రావలసి వచ్చిందని అన్నారు.దేవుడు ఉన్నాడని ఆయన అన్నారు. దేవుడు న్యాయం చేస్తాడని,ప్రజలకు ఈ విషయం తెలుసనని అన్నారు. రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనుల వల్ల కుటుంబానికి మంచి పేరు వచ్చిందని ,కాని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల బాధ కలుగుతోందని ఆయన అన్నారు.తెలంగాణపై కాంగ్రెస్ వారు క్లారిటీ ఇవ్వాలని,ఏమి చెప్పకుండా మీరు వెళ్లిపొండని అనడం దారుణమని అనిల్ వ్యాఖ్యానించారు. రాజకీయాలలోని రానని,అవంటేనే వెగటు పుట్టేలాఉందని అన్నారు.షర్మిల కూడా రాజకీయాలలోకి రారని ఆయన చెప్పారు.అయితే జగన్ మాత్రం మంచి రాజకీయ నాయకుడు అవుతారని ఆయన అన్నారు.

0 Reviews:

Post a Comment