సమైక్యవాదాన్ని బలంగా వినిపించిన టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇప్పుడు రాష్ట్ర విభజనను అంగీకరిస్తున్నానని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తాను బాధగానే విభజనను అంగీకరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ తీరు తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్న విధంగా ఉందన్నారు. సోనియా గాంధీ ఏకపక్షంగా ఒక ప్రాంత ప్రజల కళ్లలో దుమ్ము కొట్టారన్నారు. సీమాంధ్రలో బీళ్లుగా మారే లక్షలాది ఎకరాల మాట ఏమిటని ప్రశ్నించారు.
ఒక కంట్లో కారం కొట్టి మరో కంట్లో కాటుక పెట్టినట్లుగా కాంగ్రెసు పార్టీ తీరు ఉందని, రెండు నాల్కల ధోరణి చాలా ప్రమాదకరమని కాలానికి, ఓ ప్రాంత అభీష్టానికి తలవంచి విభజనను తాను అంగీకరిస్తున్నప్పటికీ కేంద్రం వైఖరిని నిరసిస్తున్నానన్నారు. సోనియా నీచ, నికృష్టంగా వ్యవహరించారన్నారు.
శ్రీకాకుళం నుండి తడ వరకు ఉప్పు సముద్రాన్ని చూసి సీమాంధ్రులు సంతృప్తి చెందాలా అని హరికృష్ణ ప్రశ్నించారు. ఎవరికి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి కుటుంబం విడిపోయేటప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తులు పంచుకునే సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. సంప్రదింపులు, సమాలోచనలు లేకుండా ఓ ప్రాంతాన్ని రోడ్డు పైకి నెట్టేస్తారా అన్నారు. దుష్ట సంస్కృతి టిడిపిది కాదని కాంగ్రెసు పార్టీదే అన్నారు. టిడిపిది కన్న పేగు మమకారమన్నారు.

0 Reviews:
Post a Comment