
తెలుగుదేశం పార్టీ మోసపూరిత విధానాన్ని అనుసరించిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తింది. చంద్రబాబు నాయుడుకు దీనికి సంబందించిన అన్ని విషయాలు తెలుసని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కధనాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.సరైన న్యాయం చేయకుండా విభజన చేయడాన్ని తాము తప్పు పడుతున్నామని అన్నారు.చంద్రబాబు చీకట్లో చంద్రబాబుతో మాట్లాడుతున్నారని, తెరవెనుక మాట్లాడుతున్నారని అన్నారు.జగన్ ను దెబ్బతీయాలని, ఆయనను జైలులో పెట్టి రాష్ట్రాన్ని విభజన కూడా చేశారని అన్నారు. తండ్రి పాత్రను కాంగ్రెస్ పోషించలేకపోతే, చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయిందని , అందువల్లనే ఈ రెండు పార్టీలను ప్రజలు నిలదీస్తున్నారని జూపూడి అన్నారు.చంద్రబాబు పెద్ద ప్యాకేజీ అడుగతున్నారని,గతంలో ఎక్కడైనా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు అలా ఇచ్చారా?కొత్త కుట్రకుచంద్రబాబు వ్యూహం పన్నుతున్నారా అని జూపూడి ధ్వజమెత్తారు.
0 Reviews:
Post a Comment