
సమైక్యవాదిగా పేరొందిన ఇరవై సూత్రాల కమిటీ ఛైర్మన్ ఎన్.తులసిరెడ్డిపై కొందరు సమైక్యవాదులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.కర్నూలులో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా , లాయర్ల జెఎసి ఈ దాడికి పాల్పడింది.దీంతో తోపులాట జరిగి తులసిరెడ్డి చొక్కా చిరిగిపోయింది.వెంటనే తులసిరెడ్డి పదవికి రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు.లాయర్లు ఇలా దాడులు చేయడం ఏమిటో అర్ధం కాదు.తెలంగాణలో కొందరు ఇలా చేస్తే అభ్యంతరం అనుకుంటే ఇప్పుడు కర్నూలు లో కూడా అలాగే చేయడం బాధాకరం.
kommineni
0 Reviews:
Post a Comment