
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లిన తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని రాష్ట్ర సమైక్యతకు గుర్తుగా అబివర్ణిస్తున్నారు.ఆయనవల్లే ఇంతకాలం రాష్ట్రం సమైక్యంగా ఉందని ,అబివృద్ది ఫలాలు అందినందువల్లనే ఆయన హయాంలో ఉద్యమాలు రాలేదని ప్రవీణ్ అంటున్నారు.రాష్ట్రాన్ని చీల్చమని ఆరుసార్లు అడిగిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిపై అబాండాలు వేస్తున్నారన్నారని ఆయన ధ్వమజెత్తారు.ఇప్పుడు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని బస్ యాత్ర చేస్తారని ప్రవీణ్ ప్రశ్నించారు.
0 Reviews:
Post a Comment