Contact us

జగన్ ను ఆస్పత్రికి తరలించే అవకాశం
జగన్ ను ఆస్పత్రికి తరలించే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో  చంచల్ గూడ జైలులో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. బాగా నీరసించిపోయారు. ఆయనను నిమ్స్ కు గానీ, ఉస్మానియా ఆస్పత్రికి గాని తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జైలు అధికారులు నిన్న సాయంత్రం నుంచి ఆరోగ్య వివరాలు తెలియజేయడంలేదు. ఈ రోజు ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. గోప్యత పాటిస్తున్నారు. జగన్ తీవ్రంగా నీరసించిపోయినట్లు తెలుస్తోంది. పరీక్షల వివరాలు అందలేదని సాకులు చెప్పడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నేత ఆరోగ్యం వివరాలు తెలుసుకునేందుకు కోట్ల మంది జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. చంచల్ గూడ జైలు వద్ద కూడా భద్రతను పెంచారు. భఃద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఈ నేపధ్యంలో ఆయనను ఆస్పత్రికి తరలిస్తారని తెలుస్తోంది. జైలు అధికారులు జగన్ ఆరోగ్యం పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. పోలీసులు కూడా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

sakshi news

0 Reviews:

Post a Comment