బాలకృష్ణ కుమార్తె తేజస్విని, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనవడు భరత్ లకు హైదరాబాద్ లో వివాహం ఘనంగా జరిగింది. హైటెక్స్ లో జరిగిన ఈ వివాహం కార్యక్రమాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.భరత్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్.పి ,ప్రముఖ పారిశ్రామికవేత్త ఎమ్.వి.వి.ఎస్.మూర్తి కి కూడా మనుమడే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పలువురు రాజకీయ, సీనీ ప్రముఖలు వదూవరునలు ఆశీర్వదించారు.![]() ![]() |
నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు(బుధవారం) ఘనంగా జరుగుతోంది. ఇందుకు వివాహ వేదిక సర్వాంగసురదరంగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ కల్యాణానికి వేదిక అయ్యింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేసారు.
ఓ ప్రక్క ఆధునికంగా ఉంటూ... తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక నందమూరి కుటుంబ సభ్యులంతా వేదికపై కూర్చునేలా పెద్ద మండపాన్ని సిద్ధం చేశారు. ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మండపం చుట్టూ ఎల్‌ఈడీ తెరలను సిద్ధం చేశారు. ఈ వేడుక కోసం సినీ కళాదర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు.



http://telugu.oneindia.in
0 Reviews:
Post a Comment