దాదాపు ఏడాది నుంచి జైలులో ఉంటున్న జగన్ వచ్చే నెలలో బయటకు రానున్నారా.. అంటే అవుననే అంటున్నాయి సిబిఐ వర్గాలు. గతంలో పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసిన జగన్‌కు కేసు విచారణ కొనసాగుతుండటంతో బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అయితే జగన్ కేసులో సిబిఐ తుది చార్జీషీట్ వేసే అవకాశం లేనందున ఇక జగన్‌కు బెయిల్ కాయం అంటున్నారు.
బెయిల్ ఇచ్చేందుకు అడ్డు చెప్పడానికి సిబిఐ దగ్గర ఎలాంటి కారణాలు లేకపోవటంతో ఈ సారి కోర్టులో జగన్ బెయిల్ విషయమై కోర్టులో ఎలాంటి అడ్డు ఉండకపోవచ్చంటున్నారు. దీంతో వచ్చే నెలలో జగన్ విడులకు మార్గం సుగమం అయినట్టే అంటున్నారు.
జగన్ కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్‌లను దాఖలు చేసిన సిబిఐకి తుది చార్జీషీట్ ఇంకా రెడీ కాలేదు. దీంతో ఇక జగన్‌కు బెయిల్ ఇవ్వడం తప్ప మరో దారి లేదంటున్నారు అధికారులు.
0 Reviews:
Post a Comment