Contact us

కొరడాతో కొట్టుకున్నటిడిపి ఎమ్.పి
ప్రజల ఆర్తనాదాన్ని పార్లమెంటులో వినిపిస్తున్నానని చిత్తూరు టిడిపి ఎమ్.పి డాక్టర్ ఎన్.శివప్రసాద్ అన్నారు.తమ స్వరాన్ని పెంచి న్యాయం చేయాలని ప్రార్ధిస్తుంటే, తమను సస్పెండ్ చేశారని అన్నారు.మంత్రి కమలనాద్ తమ వద్దకు వచ్చి అఖిలపక్షం వేస్తానని అన్నారని, కాని పదిహేను నిమిషాలలో సస్పెండ్ చేశారని అన్నారు.కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగించడం కుదరదని అన్నారు.తమ ఆర్తనాదం వృధా అవుతోందని అన్నారు.దీనికి నిరసనగా తాను కొరడాతో కొట్టుకుంటున్నానని ఆయన కొట్టుకుని చూపించారు.నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ తాము నలుగురమే అయినా పోరాడుతున్నామని,దానిని పట్టించుకోకపోగా అన్యాయంగా సస్పెండ్ చేశారని అన్నారు.
మీకు చేతనైతే బొగ్గు కుంభకోణంలోనివారిని, 2 జి కేసులోవారిని సస్పెండ్ చేయాలని, ప్రజలకు కోసం తమను సస్పెండ్ చేస్తారా అని కిష్టప్ప ప్రశ్నించారు.సీమాంద్ర కు న్యాయం జరిగే విధంగా విభజన జరిగేవరకు పోరాటం చేస్తామని నరసరావుపేట ఎమ్.పి వేణుగోపాలరెడ్డి అన్నారు. 


0 Reviews:

Post a Comment