Contact us

వైసీపీ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీలో..
tammineni-sitaram
తెలుగుదేశం పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆ పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాతోపాటు ఓ బహిరంగలేఖను కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుకు పంపించారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు టీడీపీని భ్రష్టు పట్టించారని అన్నారు. బాబు లేఖ ఇవ్వడంతోనే కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని సీతారాం అన్నారు. ఎన్టీఆర్ సిద్దాంతాలను, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయినందునందునే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

చంద్రబాబు తనయుడు లోకేష్ నాయుడును మెదక్ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. హరికృష్ణ చిత్తశుద్ధితో రాజీనామా చేశారని, హరికృష్ణ ఆందోళనకు నా మద్దతు ఉంటుందని సీతారాం చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్షలు నిజాయితీతో కూడుకున్నవని తమ్మినేని సీతారాం కొనియాడారు. వైసీపీ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీలో చేరతాననే సంకేతాలు ఇచ్చారు.

0 Reviews:

Post a Comment