Contact us

జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి డాక్టర్లు రంగం సిద్దం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, కీటోన్స్ పెరుగుతున్నాయని,అది ప్రమాదకరమని ఉస్మానియా డాక్టర్లు చెబుతున్నారు.ఆయనను దీక్ష విరమించాలని కోరినా అంగీకరించడం లేదని, గ్లూకోజ్ నీరు తీసుకోవాలని సూచించినా ఒప్పుకోలేదని డాక్టర్లు ప్రకటించారు.దీంతో ఇప్పుడు పరిస్థితి విషమిస్తున్నందున బలవంతంగా చికిత్స చేయవచ్చని చెబుతున్నారు. కాగా ఆయనను పరామర్శించడానికి వెళ్లిన ఆయన బాబాయి వై.ఎస్.వివేకానందరెడ్డి,మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ లు అక్కడకు వెళ్లగా అదికారులు లోనికి అనుమతించలేదు.ఉస్మానియా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

kommineni

0 Reviews:

Post a Comment