
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అడిగినా ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు పదే పదే ఎందుకు ఇస్తున్నారని అడిగామని తెలిపారు. అలాగే, వైయస్ పైన చేసిన కామెంట్స్ గురించి అడిగితే.. తాను అలా అనలేదని, ఆయన ఆధ్వర్యంలోనే 40 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు కదా? మరి ఇప్పుడేంటి ఇలా? అని మాత్రమే తాను ప్రశ్నించానని ప్రధాని వివరించారని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో దీక్ష చేసిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మికి ఎవ్వరు ఎక్కడైనా నివసించొచ్చన్న సంగతి తెలియదా? ఆమె కొడుకు బెంగళూరులో 32 ఎకరాల్లో సువిశాలమైన బంగళా కట్టుకున్న సంగతి తెలియదా? అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయలక్ష్మి దీక్షను తీవ్రంగా విమర్శించారు. కర్రుకాల్చి వాత పెట్టినట్లు తెలంగాణ ప్రజల్ని తీవ్రమానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా రాక్షసులుగా, సీమాం«ద్రుల్ని దోచుకున్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపైన, పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేస్తున్న రభసపై తెలంగాణలోని టీడీపీ నాయకులు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోరితే తాము తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిపిస్తామన్నారు.
0 Reviews:
Post a Comment