తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఆంద్రకు వెళ్లవలసిందే, ఎలాంటి ఆప్షన్లు ఉండవని తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇప్పిస్తామని చంద్రశేఖరరావు చెప్పారు.ఉద్యోగులకే కాకుండా రిటైరైన వారికి కూడా వర్తింప చేస్తామన్నారు.ప్రపంచలోనే ఎక్కడా లేని విధంగా సకలజనుల సమ్మె చేసి ఉద్యోగులు చరిత్ర సృష్టించారని అన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరణకు కృషి చేస్తామని అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ అన్నారు.తాము ఎప్పుడూ జాగో,బాగో అనలేదని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment