Contact us

వై.కాంగ్రెస్ లోకి తమ్మినేని సీతారామ్?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని కధనాలు వస్తున్నాయి. ఆయన ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం లేదు.విశాఖలో చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు కూడా రాలేదు.తమ్మినేని గత ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయాక తిరిగి టిడిపిలోకి వచ్చారు. కాని మళ్లీ పొసగక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబుతున్నారు.త్వరలో చంచల్ గూడ జైలుకు వచ్చి జగన్ ను కలవవచ్చు.


kommineni news

0 Reviews:

Post a Comment