Contact us

బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన  అదృశ్యమైన నటి
బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీషహైదరాబాద్ : మూడు నెలల క్రితం అదృశ్యమైన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది. తల్లి దండ్రుల వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది.  తన స్నేహితుల వద్దే తలదాచుకున్నానని తెలిపింది.  ఆమెపై అదృశ్యం కేసు నమోదు కావడంతో బంజారాహిల్స్‌లో పోలీసులు కోర్టుకు తరలించారు. ఆమెను నింబోలి అడ్డ రెస్క్యూ హోంకు తరలించాలని  పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సాయి శిరీష నాటకీయ ఫక్కిలో  సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు. సవతి తండ్రి నీల ప్రసాద్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని శిరీష ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో వెల్లడించడం సంచలనం రేపింది.  లవ్ ఎటాక్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హర్షిత అదృశ్యమైనట్టు సవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. మే 27న షూటింగ్ కు  వెళ్లిన తమ అమ్మాయి జాడ తెలియడం లేదని  ఫిర్యాదులో  పేర్కొన్నారు.
 అయితే అదృష్యమైన శిరీష నాటకీయ ఫక్కిలో సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు. 
నీల ప్రసాద్ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం తప్పుదారి పట్టించే విధంగా ఉండటంతో పోలీసుల్లో పలు సందేహాలు తలెత్తాయి. నీల ప్రసాద్ వ్యవహారశైలిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. 
బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీషఇదిలా ఉండగా టెలివిజన్ చానెల్లో మాట్లాడుతూ తాను లొంగిపోకపోయినా.. లైంగిక వేధింపుల విషయాన్ని ఎవరికైనా తెలిపినా.. తన సవతి తండ్రి చంపేస్తానని బెదిరించాడని శిరీష చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై లైంగికంగా వేధించేవాడని, తన తల్లి సవతి తండ్రిపై ఆధారపడి ఉందని.. అందుకే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. 

0 Reviews:

Post a Comment